వర్షాకాలంలో పుట్టగొడుగులు తింటున్నారా..? 

Jyothi Gadda

01 June 2025

పుట్టగొడుగులు తినడం ఆరోగ్యానికి మంచిదే. దాని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పుట్టగొడుగుల్లో బోలెడన్ని విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ఉన్నాయి.

పుట్టగొడుగుల్లో బోలెడన్ని విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సైతం పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉంటాయి.

ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సైతం పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉంటాయి. కానీ, వర్షాకాలంలో మాత్రం.. పుట్టగొడుగులను తినకపోవడమే ఉత్తమం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

ఎందుకంటే.. వర్షాకాలంలో నేలపై బోలెడంత బ్యాక్టీరియా ఉంటుంది. వర్షాలు పడేప్పుడు చాలా రకాల పుట్టగొడుగులు పుడతాయి. వాటిలో విషపూరితమైనవీ ఉంటాయి.

తడి నెలలో ఫంగస్ ఏర్పడుతుంది. దాని వల్ల బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియాల వల్ల వైరల్ ఫీవర్లు, అలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వర్షాకాలంఓ రకరకాల పుట్టగొడుగులు పెరగడం ప్రారంభిస్తాయి. అన్ని రకాల పుట్టగొడుగులు తినదగినవి కావు. దీని గురించి తెలుసుకోవాలి. అలాంటి వాటితో అనారోగ్యం తప్పదు.

కొన్ని పుట్టగొడుగులు తినదగిన పుట్టగొడుగులవలె కనిపిస్తాయి. కానీ అవి విషపూరితమైనవి. వీటి ద్వారా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. 

పుట్టగొడుగులను తినడం వల్ల కొంతమందికి చర్మ అలెర్జీ సమస్యలు తలెత్తుతాయి. ఇప్పటికే అలెర్జీ, శ్వాసకోస సమస్యలతో బాధపడేవారు పుట్టగొడుగుల్ని ఎక్కువగా తినకూడదు.