కానీ కొంతమంది దానిమ్మ పండ్లను తినడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..ఏయే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దానిమ్మకు దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.
దానిమ్మ గింజల్లో శరీరానికి అవసరమైన విటమిన్ కేతో పాటు విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అలాగే దానిమ్మ గింజలను ఇతర ఖనిజాలు కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి.
దానిమ్మ గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. రోజు తినడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ఇప్పటికే తక్కువ రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు దానిమ్మ గింజలను తినడం మానుకుంటే చాలా మంచిదట. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట.
తక్కువ రక్తపోటు ఉన్నవారు కూడా దానిమ్మపండు తినకూడదు. ఎందుకంటే దానిమ్మపండు చల్లదనాన్ని కలిగిస్తుంది. ఇది మన శరీరంలో రక్త ప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది.
హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు ఉన్నవారు దానిమ్మ పండు తింటే రక్తపోటు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు దానిమ్మ పండు తినకూడదు.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండు తింటే హార్మోన్ల అసమతుల్యతకు గురవుతారు. దానిమ్మపండును ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదు. దీన్ని వల్ల అనేక సమస్యలు వస్తాయి.
హై షుగర్ కలిగిన దానిమ్మ గింజలను మధుమేహం ఉన్నవారు కూడా తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. స్కిన్ ఎలర్జీ ఉన్నవారికి కూడా దానిమ్మ మంచిది కాదంటున్నారు.