మార్కెట్లో మనకు ఎన్నో రకాల కూరగాయలు అందుబాటులో ఉంటాయి. వాటిల్లో దొండకాయ కూడా ఒకటి. చూడటానికి చిన్నగా, పొట్టిగా కనపడినా తక్కువ అంచనా వేయలేం అంటున్నారు నిపుణులు.
దొండలోనూ అనేక పోషకాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..అయితే, దొండ కాయల్ని తింటే బుద్ధి మందగిస్తుందనేది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.
దొండలోని యాంటీ -హిస్టమైన్ గుణాల వల్ల అలర్జీ రాదు. దగ్గు, ఆకలి లేకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారికి దివ్యౌషధం. వీటిలోని విటమిన్-బి నాడీ వ్యవస్థను రక్షిస్తుంది.
మానసిక ఆందోళన, మూర్ఛ వ్యాధితో బాధపడేవారికి దొండకాయ చక్కటి పరిష్కారం. రిబోఫ్లేవిన్ పుష్కలంగా ఉండే దొండకాయ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.
దొండకాయలోని క్యాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది. మధుమేహవ్యాధిగ్రస్తులు కూడా నిక్షేపంగా తినవచ్చు.
థయమిన్ దొండలో పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వు, ప్రొటీన్ల జీవక్రియకు ఉపయోగపడుతుంది. బి-కాంప్లెక్స్ విటమిన్లు జీర్ణవ్యవస్థకూ మేలుచేస్తాయి.
అంతేకాదు..దొండకాయను ఆయుర్వేదంలో మధుమేహానికి ఔషధంగా ఉపయోగిస్తారు. దీనిలో యాంటీ-అడిపోజెనిక్ ఏజెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి.
దొండకాయ, దొండ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. షుగర్ బాధితులు వారంలో ఒక రోజు దొండ కాయ తిన్నా, దొండ ఆకుల రసం తాగినా మంచిది.