అవిసె గింజలు రోజూ తింటే డయాబెటిస్​ తగ్గుతుందా?

Jyothi Gadda

12 May 2025

చూడటానికి చిన్నగా కనిపించే ఈ గింజలు ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. ఆయా లాభాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో అవిసె గింజలు చాలా మేలు చేస్తాయి. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి,మంచి కొలెస్ట్రాల్​ను పెంచుతాయి.

రోజూ క్రమం తప్పకుండా అవిసె గింజలు తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. తినాలనే కోరిక తగ్గుతుంది. 

అవిసె గింజలలోని ఫైబర్ కారణంగా జీర్ణప్రక్రియ సజావుగా సాగుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చునని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

అవిసె గింజలు తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్​తో బాధపడుతున్నా వారు క్రమం తప్పకుండా అవిసె గింజలు తీసుకుంటే మంచిది.

అవిసె గింజలను తినడం ద్వారా రక్తపోటు నియంత్రణంలో ఉంటుంది. సిస్టోలిక్, డయాస్టోలిక్ ఒత్తిడి తగ్గుతుంది. వీటి వల్ల స్ట్రోక్, గుండె సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 

అవిసె గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గడంతో పాటు ఒబెసిటీ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

అవిసె గింజల్లో లిగ్నాన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్,ఈస్ట్రోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు క్యాన్సర్​ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.