30 రోజుల పాటు పిస్తా పప్పు తింటే ఏమౌతుందో తెలుసా..?
Jyothi Gadda
06 May 2025
రోజుకి ఐదు నుంచి ఆరు పిస్తా పప్పులు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పిస్తా పప్పులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
పిస్తా తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మెదడు పని తీరు మెరగవుతుంది. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు నిండివున్నాయి.
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. దీంతో, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. పిస్తాపప్పులు గుండె జబ్బుల్ని నివారిస్తాయి. రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది.
పిస్తాపప్పులో లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ రెండు పదార్థాలు ప్రత్యేకంగా రెటీనాను రక్షిస్తాయి.
అస్పష్టమైన దృష్టి, కంటిశుక్లం వంటి వయస్సు సంబంధిత కంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. పిస్తాపప్పుతో కంటి చూపును కాపాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
పిస్తాలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఫైబర్ మలబద్ధకం, ఉబ్బరం, ఇతర కడుపు సమస్యలను తగ్గిస్తుంది. పిస్తా పప్పు హెల్తీ గట్‌కు సాయపడుతుంది.
పిస్తా పప్పు తినడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తుంది. పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
రోజూ ఒక గుప్పెడు పిస్తా తినడం వల్ల అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గుతాయి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ ఒక గుప్పెడు పిస్తా తినడం వల్ల కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది.