ఈ పండు ప్రయోజనాలు మెండు.. వరుసగా వారం రోజులు తింటే..
Jyothi Gadda
16 May 2025
పీచ్ పండ్లు డైట్లో చేర్చుకోవడం వల్ల పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది అద్భుతమైన పండు.
పోషకాలు పుష్కలం ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. అంతేకాదు కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారిస్తుంది.
విటమిన్ ఏ తో పాటు బీటా కెరోటీన్ కూడా పుష్కలంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కంటి చూపును మెరుగుపరిచి ఇది క్యాటరాక్ట్ సమస్యలు రాకుండా నివారిస్తుంది.
ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు డయేరియా, మలబద్దక సమస్యలను కూడా ఇది నివారిస్తుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది.
పీచ్ పండును తీసుకోవటం వల్ల హానికరమైన అల్ట్రా వైలెట్ రేస్ నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది. పీచ్ పండులో విటమిన్ సీ, బీటా కెరోటీన్ ఉంటుంది. చర్మానికి నిగారింపునిస్తుంది.
ఈ పీచు పండులో విటమిన్ సి, పొటాషియం, పోషకాలు దట్టంగా ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. పీచు పండు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నించేవారు పీచు పండును డైలీ వర్కౌట్స్ తర్వాత తింటే మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా.. ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పీచు పండులోని విటమిన్ సి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా నిరోధకతను పెంచడలో, వీటిలోని యాంటీఆక్సిడెంట్లు కొన్ని క్యాన్సర్లకు కారణమయ్యే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది.