ఆలీవ్ ఆయిల్‌లో ఒలీక్ యాసిడ్, పాలిఫెనాల్స్ ఎక్కువగా ఉండడం వల్ల బీపిని కంట్రోల్ చేస్తుంది. దీంతో పాటు గుండె సమస్యల్ని తగ్గించడంతో పాటు గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆలివ్ ఆయిల్‌తో జీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఇందులోని మోనోశాచురేటెడ్ కొవ్వులు జీర్ణ సమస్యల్ని దూరం చేసి ప్రేగు కదలికల్ని ప్రోత్సహిస్తుంది. పేగు వ్యాధులు, పూత వంటి సమస్యలు రావు.
ఆలివ్ఆయిల్ వాడకం బ్రెయిన్ హెల్త్‌కి మంచిది. మతిమరుపు సమస్యలు దూరమవుతాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎంతో మేలు చేస్తాయి.
క్యాన్సర్స్‌ని దూరం చేయడంలో ఆలివ్ ఆయిల్‌ని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ముందుంటాయి. ఇవి రొమ్ము, పెద్దప్రేగు, ప్రొస్టేట్ క్యాన్సర్ సహా క్యాన్సర్స్‌తో పోరాడతాయి.
క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆలివ్ నూనె మితంగా వాడితే బరువు నియంత్రణకు తోడ్పడుతుంది. ఇందులోని మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు మీకు కడుపు నిండిన సంతృప్తిని కలిగిస్తాయి.
కేలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఆయిల్‌ని వాడితే బరువు తగ్గుతారు. ఆలివ్ ఆయిల్ తీసుకోగానే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. దీంతో బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది.
ఆలివ్ నూనె అత్యధిక స్థాయిలో ప్రయోజనకరమైన సమ్మేళనాలను కలిగి ఉంటుంది. వంటకోసం ఆలివ్ నూనెను ఉపయోగించడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.