పచ్చి ఉల్లిపాయ తినడం మంచిదేనా..?

Jyothi Gadda

24 May 2025

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే లక్షణాలు ఉల్లిపాయల్లో మెండుగా ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే రసాయనాలు పుష్కలంగా ఉంటాయి. మధుమేహులకు మంచిది.

ఉల్లిపాయలోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి. అలాగే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుంచి రక్షిస్తాయి. పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల చర్మం మెరిసేలా ఆరోగ్యంగా మారుతుంది.

ఉల్లిపాయలో ఉండే సల్ఫర్, క్వెర్సెటిన్ అనే పదార్థాలు ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. బోలు లాంటి ఎముకల వ్యాధిలకు దూరంగా ఉంచుతాయి. ఎముకలకు బలం.

యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉండే ఉల్లిపాయలను పచ్చిగా తినడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదాలు తగ్గుతాయి. శరీరం ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడేందుకు సహాయపడతాయి.

ఉల్లిపాయలోని సల్ఫర్ రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు, హార్ట్‌ స్ట్రోక్ వంటివి దరి చేరకుండా ఉంటాయి. గుండెకు చాలా మంచిది. 

ఉల్లిపాయలోని సల్ఫర్ రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు, హార్ట్‌ స్ట్రోక్ వంటివి దరి చేరకుండా ఉంటాయి. గుండెకు చాలా మంచిది. 

ఫైబర్ అధికంగా ఉండే ఉల్లిపాయను పచ్చిగా తిన్నా.. వండుకుని తిన్నా సులభంగా అరుగుతుంది. ఇది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఉల్లిపాయలోని ప్రీబయోటిక్స్ పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఉల్లిపాయలోని సల్ఫర్, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా చేస్తాయి. కొలొరెక్టల్, కడుపు కాన్యర్ వంటి ప్రాణాంతక క్యాన్సర్ ప్రమాదాలను తగ్గించే లక్షణాలు ఉన్నాయి.