గోధుమ గడ్డి రసం మన శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. 2015లో జరిగిన పరిశోధన ప్రకారం, గోధుమ గడ్డిలోని పోషకాలు.. శరీరంలోని మలినాలు, టాక్సిన్స్‌ను తొలగిస్తాయి.
గోధుమ గడ్డిలోని క్లోరోఫిల్ శరీరంలోని విష పదార్థాలను తొలిగించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు తోడ్పడుతుంది. శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది.
గోధుమ గడ్డిలో ఎంజైమ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి ఇవి సహాయపడతాయి.
గోధుమ గడ్డి జీర్ణక్రియను మెరుగుపరిస్తుంది. గోధుమ గడ్డిలోని డిటాక్స్ ప్రభావాలు పేగులను శుభ్రపరుస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది.
గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి, కొవ్వు కూడా ఉండదు.
ఇది తాగిన తర్వాత కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. వీట్ గ్రాస్ జ్యూస్ చక్కెర, కొవ్వు అధికంగా ఉండే.. ఆహారాల పట్ల కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది.
గోధుమ గడ్డి రసం మన శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. 2015లో జరిగిన పరిశోధన ప్రకారం, గోధుమ గడ్డిలోని పోషకాలు.. శరీరంలోని మలినాలు, టాక్సిన్స్‌ను తొలగిస్తాయి.