ఈ ఒక్క జ్యూస్‌తో మీ ఆరోగ్యం మరింత పదిలం..!

Jyothi Gadda

02 July 2025

గోధుమ గడ్డి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గోధుమ గడ్డిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. 

గోధుమ గడ్డి రసం మన శరీరాన్ని డీటాక్స్‌ చేస్తుంది. 2015లో జరిగిన పరిశోధన ప్రకారం, గోధుమ గడ్డిలోని పోషకాలు.. శరీరంలోని మలినాలు, టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. 

గోధుమ గడ్డిలోని క్లోరోఫిల్‌‌‌‌‌ శరీరంలోని విష పదార్థాలను తొలిగించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు తోడ్పడుతుంది. శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది.

గోధుమ గడ్డి జీర్ణక్రియను మెరుగుపరిస్తుంది. గోధుమ గడ్డిలోని డిటాక్స్ ప్రభావాలు పేగులను శుభ్రపరుస్తాయి. గ్యాస్‌, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది. 

గోధుమ గడ్డి జ్యూస్‌ తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి, కొవ్వు కూడా ఉండదు. 

గోధుమ గడ్డిలో ఉండే క్లోరోఫిల్‌ హీమోగ్లోబిన్‌ నిర్మాణాన్ని పోలి ఉండి, అచ్చం దానిలానే పనిచేస్తుందట. ముఖ్యంగా కీమోథెరపీ సమయంలో గోధుమ గడ్డి రసం తీసుకుంటే మంచిది.

గోధుమ గడ్డి క్యాన్సర్ కణాలను చంపడానికి, క్యాన్సర్ అభివృద్ధిని తగ్గించడంలో సహాయపడుతుందని నిరూపించాయి. ఒక అధ్యయనంలో ఇది కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గిస్తుందని తేలింది.

గోధుమ గడ్డిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది అర్థరైటిస్‌ కారణంగా వచ్చే బోన్‌ స్టిఫ్‌నెస్‌, నొప్పి, వాపు వంటి లక్షణాల నుంచి ఉపశమనం ఇస్తుంది.