నేరేడు పండ్లు ఎండాకాలంలో ఎక్కువగా కన్పిస్తుంటాయి. వీటిలో అన్నిరకాలు విటమిన్ లు, మినరల్స్ ఉంటాయి. అయితే.. నేరేడు పండ్లు తిన్న తర్వాత కొన్నింటిని అస్సలు తినకూడదు.
విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లు రక్తహీనతను నివారిస్తాయి.
అయితే.. నేరేడు పండ్లలో ముఖ్యంగా శరీరం పెరుగుదలకు, జీవక్రియలు వేగవంతం చేసే కారకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ, ఈ నేరేడు పండ్ల వల్ల కొన్ని సైడ్ ఎఫేక్ట్ లు ఉన్నాయి.
నేరేడు పండ్లను తిన్న తర్వాత పాలు, టీలు తాగడం వంటివి అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.. దీని వల్ల కడుపులో గ్యాస్ సమస్య ఏర్పడి ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అంతేకాకుండా నేరేడు పండ్లు తిన్న తరువాత స్పైసీ ఫుడ్, జంక్ పదార్థాలు కూడా అస్సలు తినకూడదు. ఇవి కడుపులో విషంతో సమానం. వెంటనే జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తాయి.
నేరేడు పండ్లు పుల్లగా ఉంటాయి. వీటిలో ఆమ్ల గుణం ఉంటుంది. పాల ఉత్పత్తులతో కలిపి తీసుకోవడం వల్ల పాలు విరిగిపోయి, జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది.
దీనివల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నేరేడు పండ్లు తిన్న తర్వాత గంట సమయం గ్యాప్ ఇచ్చి పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిది.
నేరేడు పండ్లు, పసుపు రెండింటికి విరుద్ధమైన స్వభావాలు ఉన్నాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో అసౌకర్యం, నొప్పి లేదా ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.