తరచూ చిలకడదుంపలు తింటున్నారా..? ఇది తెలుసుకోండి..

Jyothi Gadda

11 June 2025

చిలకడదుంప పొటాషియంను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇది హృదయ స్పందన, నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిర్లను తగ్గిస్తుంది. 

కడుపు, జీర్ణాశయంలో ఏర్పరిచే అల్సర్‌లను తగ్గిస్తుంది. ఫైబర్లను అధిక మొత్తంలో ఉండటం వల్ల అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు దరి చేరకుండా చేస్తుంది. 

చిలకడ దుంప, శరీర రక్తంలో తెల్ల రక్తకణాలను, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని అధికం చేసి, ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక కల్లోలాలను తగ్గించి, శక్తిని పెంచుతుంది.

చిలకడ దుంప విటమిన్ 'డి'ని పుష్కలంగా కలిగి ఉండటం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. గుండె కండరాలు బలంగా ఉండేలా నిర్మిస్తుంది.

చిలకడదుంప పుష్కలమైన విటమిన్ 'సి' కలిగి ఉంటుంది. ఇది జలుబు, ఫ్లూలను తగ్గించటమే కాకుండా, దంతాలు, ఎముకల ఏర్పాటు, రక్త కణాల, కొల్లజన్ ఉత్పత్తిలను పెంచుతుంది.

తీపి చిలగడదుంపలు బీటా-కారిన్‌లకు గొప్ప మూలం. ఇది శరీరాన్ని విటమిన్ ఎగా మారుస్తుంది. చర్మం పై ముడతల నివారణకు విటమిన్ ఎ పోషకం కీలకపోషకం. 

ఇది సూర్యరశ్మి నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ప్రకాశవంతమైన రంగు కోసం అవసరమైన ఆరోగ్యకరమైన చర్మ కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

విటమిన్ 'ఎ' యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంటుంది. క్యాన్సర్ కలుగచేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంతేకాదు, విటమిన్‌ బి6 సమృద్ధిగా కలిగి ఉంటుంది.