ఉసిరికాయలు బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులకు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఉసిరి ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఉసిరి ముసలితనాన్ని నిరోధించడంలోనూ, శక్తివంతులుగా చేయడంలో దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఎలర్జీల నుండి రక్షణ కల్పించడంలో ఉసిరికాయ ఎంతో దోహదపడుతుంది.
ఉసిరి ఫంగస్ నిరోధకంగా రక్తనాళాలలో కలిగే ఫ్లేక్ నిరోధకంగా, క్యాన్సర్ నిరోధకంగా జీవకణాల్లో డీఎన్‌ఏకు పెంచడం ద్వారా రోగ నిరోధకంగా పనిచేస్తుంది.
శరీరంలో నిరంతరం జరిగే జీవ ప్రక్రియతోపాటు కాలుష్యంవల్ల శరీరంలో కణాల మధ్య జరిగే నష్టాన్ని నివారించడంలో చక్కటి పాత్ర పోషిస్తుంది.
అనారోగ్యాన్ని కలిగించే కణ విభజనను ఉసిరి నివారిస్తుంది. సూపర్ ఫుడ్‌గా పరిగణించే పసుపు కంటే ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు రెండు రెట్లు అధికంగా ఉంటాయి.
ఉసిరిలో మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం వలన జ్ఞాపక శక్తిని కూడా పెంచుకోవచ్చు.
ఉసిరిని తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు. ఉసిరిని తీసుకోవడం వల్ల పిపిఏఆర్ పెరుగుతుంది దీనితో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ VLDL కొలెస్ట్రాల్ తగ్గుతాయి.
చాలా మందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఉసిరిని డైట్ లో చేర్చుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. అలానే జుట్టు బాగా ఎదుగుతుంది.