వాస్తు టిప్స్.. గులాబీలతో ఇలా చేస్తే మీ ఇంట కనకవర్షమే!

samatha 

09  JUN  2025

Credit: Instagram

వాస్తు టిప్స్ పాటించడం వలన ఇంట్లో సంపద పెరగడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా ఉండవని చెబుతుంటారు వాస్తు శాస్త్ర నిపుణులు.

అయితే గులాబీలు అనేవి చాలా మందికి ఇష్టమైన పూలు. చాలా మంది ఇళ్లల్లో ఈ పూలు మొక్కలు ఉంటాయి. అయితే వీటి వలన కూడా ఇంట్లో సంపద పెరుగుతుందంట. అది ఎలా అంటే?

శుక్రవారం రాత్రి లక్ష్మీ దేవికి గులాబీలను సమర్పించి, అవి మీ లాకర్‌లో పెట్టుకోవడం వలన మీ ఇంట్లో సంపద పెరగడమే కాకుండా, కనకవర్షం కురుస్తుందంట.

మంగళవారం నుంచి 11 వారాల పాటు ఆంజనేయ స్వామికి గులాబీలను సమర్పించి కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయ.ఆర్థిక సమస్యలు తీరిపోతాయంట.

అనారోగ్యంతో ఉన్న వ్యక్తిపై నుంచి ఒక తమలపాకుపై గులాబీ అలాగే దానిపై కపర్పూరం పెట్టి ఏడు సార్లు తిప్పి, తర్వాత దానిని కాలచ్చడం వలన ఆ వ్యక్తి త్వరగా కోలుకుంటాడంట.

ఐదు గులాబీలను తెల్లటి గుడ్డలో కట్టి ఇంటిలో నాలుగు మూలల్లో పెట్టుకోవాలంట. ఒకదానిని మాత్రం ప్రవహిస్తున్న నీటిలో వదిలిపెట్టాలంట. దీని వలన ఆర్థికసమస్యలు  త్వరగా తొలిగిపోతాయంట.

మీ ఇంట్లో సంపద పెరగాలి అనుకుంటే శుక్లపక్షం మంగళ వారం రోజున, ఎరుపు రంగు క్లాత్‌లో ఎర్రటి గులాబీని గందం, కుంకుమ తో పెట్టి వస్త్రంలో కట్టాలి. దీనిని హనుమంతుడికి సమర్పించి, లాకర్‌లో పెట్టుకోవాలంట.

దీని వలన సంపద పెరగడమే కాకుండా అదృష్టం కూడా కలివస్తుందని, గులాబీలు మీ ఇంట సంతోషకర వాతావరణాన్ని తీసుకొస్తాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.