ఎండు చేపలు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

samatha 

07  JUN  2025

Credit: Instagram

ఎండు చేపల కర్రీ అంటే చాలు ప్రతి ఒక్కరూ లొట్టలేసుకొని తింటారు. ఎందుకంటే ఎండు చేపల కర్రీ అంత రుచిగా ఉంటుంది.

కానీ కొంత మంది మాత్రం ఎండు చేపలు తినడానికి అస్సలే ఇష్టపడరు ఎందుకంటే? అవి స్మెల్ వస్తాయని వాటిని దూరం పెడుతుంటారు.

కానీ ఎండు చేపలు తినడం వలనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎండు చేపల్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయంట. అంతే కాకుండా వీటి వలన శరీరానికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయంట.

పచ్చి చేపల కంటే ఎండు చేపల్లోనే ఎక్కువ పోషకాలు ఉండటం వలన వీటిని తింటే శరీరానికి అనేక లాభాలు చేకూరుతాయంట. వీటి వలన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.

అదే విధంగా ఎండు చేపలు తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందంట.ఎముకల బలాన్ని పెంపొందించడానికి, కండరాల నిర్మాణానికి ఎండుచేపలలో ఉండే ప్రోటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయంట.

అలాగే ఎండు చేపలలో ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల అది మన గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.

అంతే కాకుండా వీటిలో విటమిన్ బి12 ఎక్కువగా ఉండటం వల్ల ఇవి మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల నాడీవ్యవస్థను  కూడా మెరుగు పరుస్తుందంట.