వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచే సూపర్ ఫ్రూట్స్ ఇవే

samatha 

06 JUN  2025

Credit: Instagram

వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది త్వరగా అలసి పోవడం, అనేక వ్యాధుల బారిన పడటం జరుగుతుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.

అంతే కాకుండా ఈ సీజన్ లో అంటు వ్యాధులు కూడా దాడి చేస్తాయి. దీంతో చాలా మంది జ్వరం, దగ్గు జలుబు వంటి సమస్యలతో సతమతం అవుతారు.

అయితే వానాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తప్పకుండా కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యలు. అవి ఏవంటే?

సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా వీటిని వర్షాకాలంలో తీసుకోవడం వలన ఇవి సీజనల్ వ్యాధుల నుంచి పోరాడే శక్తిని ఇస్తాయంట.

బెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని వానాకాలంలో తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందంట.

రోగనిరోధక శక్తిని పెంచడంలో పైనాపిల్ పండు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా పైనాపిల్ తినాలంట.

వర్షాకాలంలో జామకాయలు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇవి మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

అరటి పండులో పొటాషియం, విటమిన్ బీ 6 పుష్కలంగా ఉంటాయి. అందువలన వర్షాకాలంలో ఈ పండ్లు తీసుకోవడం వలన ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయంట.