మైండ్ షార్పుగా ఉండాలంటే.. బాదంతో కలిపి తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే
samatha
05 JUN 2025
Credit: Instagram
బాదంతో కలిపి ఈ ఫుడ్ తీసుకోవడం వలన మెదడు పనితీరు మెరుగు పడటమే కాకుండా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందంట. అవి ఏవి అంటే?
బాదంతో బ్లూ బెర్రీస్ తీసుకుంటే చాలా మంచిది. ఇందులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బాదంతో తీసుకోవడం వలన ఇది మీ మైండ్ ను షార్ప్ చేస్తుందంట.
డార్క్ చాక్లెట్ తో బాదం తీసుకోవడం వలన ఇవి మీలో చురుకుదనాన్ని పెంచడమే కాకుండా మానసిక స్థితిని కూడా మెరుగు పరుస్తుందంట.
అవకాడో బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువలన వీటిని కలిపి తీసుకుంటే ఇవి మెదడుకు రక్తప్రసరణను మెరుగు పరిచి వాపును తగ్గిస్తాయంట.
బాదం పప్పు ఆకు కూరలు కలిపి తీసుకోవడం వలన బాదంలోని విటమిన్ ఇ, ఆకుకూరల్లోని ఫోలేట్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయంట.
బాదం, గుడ్లు తినడం వలన ఇవి మెమోరీ న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తికి సహాయపడటమే కాకుండా, మెదడును ఆరోగ్యంగా ఉంచుతుందంట. ఆరోగ్యం బాగుంటుంది.
పెరుగు, బాదం తీసుకోవడం వలన ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, మానసిక శక్తి స్థాయిలను పెంచుతాయంట. మెదడు చురుకుగా పని చేస్తుందంట.
బాదం, గుమ్మడి గింజలు మెగ్నీషియం, జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులను మెదడుకు అందిస్తాయి. దీంతో జ్ఞాపక శక్తిపెరగడమే కాకుండా, ఒత్తిడి కూడా తగ్గుతుందంట.