వర్షాకాలంలో హైదరాబాద్ దగ్గరలో చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు ఇవే !
samatha
04 JUN 2025
Credit: Instagram
స్నేహితులతో లేదా ఫ్యామిలీతో ఎక్కడికైనా టూర్ కు వెళ్తే అది చాలా సంతోషాన్ని ఇస్తుంటది. ఇక చాలా మంది సమ్మర్ లో టూర్ ప్లాన్ చేస్తారు.
కానీ కొంత మంది మాత్రం వర్షాకాలం మొదలవుతున్న సమయంలో టూర్ వెళ్లడానికి ఎక్కువ ఆసక్తిచూపుతారు. అయితే వానాకాలంలో హైదరాబాద్ దగ్గరిలో చూడల్సిన ప్లేసెస్ ఏవో చూద్దాం.
హైదరాబాద్ నుంచి 380 కిలో మీటర్ల దూరంలో హంపి బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. వర్షాకాలంలో పచ్చని చెట్ల మధ్య ఇక్కడికి వెళ్తే ఆ ఎంజాయ్ మెంట్ వేరే లెవల్ ఉంటదంట.
అలాగే హైదరాబాద్ నుంచి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉండే అనంతగిరి హిల్స్ టూరిస్ట్ కు బెస్ట్ ప్లేస్. ట్రెక్కింగ్ కు ఇది బెస్ట్ ప్లేస్ అంట.
ఇక హైదరాబాద్ నుంచి కేవలం 100 కిలో మీటర్ల దూరంలో పచ్చని చెట్ల మధ్య ఉన్న శ్రీరామ ఆలయం తప్పకుండా వెళ్లాల్సిందేనంట. వర్షాకాలంలో చూడాల్సిన ప్లేసెస్ లో ఇదొక్కటి.
హైదరాబాద్ కు చాలా దగ్గరి టూరిస్ట్ ప్లేసెస్ లో యాదగిరి గుట్ట కూడా ఒకటి చాలా అద్భుతమైన ఈ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవంట.
ఈశన్య కర్ణాటకలోని బీదర్ హైదరాబాద్ కు కేవలం 140 కిలో మీటర్లు మాత్రమే ఉంటుంది. అయితే టూర్ వెళ్దాం అనుకునే వారికి బీదర్ కోట అద్భుతమైన బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అంట.
వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది టూరిస్ట్ లు వెళ్లే బెస్ట్ ప్లేసెస్ లో పోచారం డ్యామ్ ఒకటి. ఇక్కడి కి ఫ్యామిలీతో వెళ్లి సరదాగా గడపవచ్చునంట. టూరిస్ట్ కు బెస్ట్ ప్లేస్.