కలలు రావడం అనేది సహజం. పడుకున్న తర్వాత ప్రతి ఒక్కరికీ కలలు వస్తుంటాయి. ఇక కొంత మందికి రాత్రిల్లు ఎక్కువ కలలు వస్తే మరికొందరికి మధ్యాహ్నం కూడా కలలు కంటారు.
ఇక కలల్లో కొందరికి తమ పూర్వీకులు కనిపిస్తే, మరికొందరికి చెట్లు , పాములు, నీరు, తమ స్నేహితులు, దేవుల్లు , దెయ్యాలు ఇలా చాలా కనిపిస్తుంటాయి.
అంతే కొన్ని కొన్ని సార్లు వెండి, బంగారం కూడా కనిపిస్తుంటుంది. కాగా, అసలు కలలో బంగారం కనిపిస్తే ఏం జరుగుతుంది. ఇది దేనికి సంకేతమో తెలుసుకుందాం.
స్వప్న శాస్త్రంలో ఒక్కో కలకు ఒక్కో రకమైన అర్థం ఉంటుంది. కొన్ని శుభాలను సూచిస్తే మరికొన్ని అశుభాలను కష్టాలను, నష్టాల గురించి కలల ద్వారా తెలియజేస్తాయి.
అయితే కలలో బంగారం కనిపించడం మంచిదేనా ? కాదా అనే డౌట్ చాలా మందిలో కలుగుతుంటుంది. అసలు విషయంలోకి వెళితే..
బంగారం సంపద లేదా శ్రేయస్సును సూచిస్తుంది. బంగారాన్ని సంపదకు గుర్తు అని అంటారు. అయితే బంగారం కలలో కనిపిస్తే మంచిదే అని అంటున్నారు పండితులు.
కలలో బంగారం కనిపించడం వలన మీరు భవిష్యత్తులో ఆర్థిక లాభాలు పొందుతారని అర్థం అంట. అంతే కాకుండా మీరు మీ అంతర్గత స్వీయ అభివృద్ధిపై దృష్టి పెట్టాలనే సూచన కూడా కావచ్చునంట.
అంతే కాకుండా కలలో బంగారం కనిపించడం, మీ ప్రతిభ మీరు ఎదగడానికి గుర్తింపు పొందడానికి సహాయపడతాయనే అర్థం కూడా వస్తుందంట.