అల్లం టీతో అద్భుత ప్రయోజనాలు.. వర్షాకాలంలో ఎన్ని సార్లు తాగాలంటే?

samatha 

29 MAY 2025

Credit: Instagram

అల్లంటీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా వర్షకాలంలో చాలా మంది అల్లం, ఇలాచీ టీ తాగడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

అయితే అల్లంటీ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. అవి ఏవ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

అల్లంటీ తాగడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందంట. ముఖ్యంగా ఇది వికారం, వాంతుల సమస్యతో బాధపడుతున్నవారికి మంచి ఔషధంలా పని చేస్తుందంట.

అల్లంటీ తాగడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుందంట. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పేగు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా కాలేయ పనితీరును కూడా మెరుగుపరుస్తాయంట.

అల్లం టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా యాంటీ ఇన్ఫ్లమెంటరీలు కూడా ఎక్కువగా ఉండటం వలన ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి

అల్లం టీ యాంటీమైక్రోబల్ వంటి వాటిని కలిగి ఉండటం వలన ఇది జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

అల్లం టీలో ఉండే అనేక ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన ఇవి ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టాన్ని నివారించి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

అయితే వర్షాకాలంలో అల్లంటీ ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ దీనిని కనీసం రోజులో రెండుసార్లు మాత్రమే తాగలంట. ఇలా చేయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుందంట.