ఈ రెండు రోజులు బట్టలు ఉతకకూడదంట..ఉతికారో సంపద మొత్తం గోవిందా..

samatha 

27 MAY 2025

Credit: Instagram

వాస్తు శాస్త్రం అనేది చాలా నియమాలు చెప్తుంటుంది. ఏ చిన్న పొరపాటుచేసినా సరే అది ఆర్థిక సంక్షోభం, కుటుంబంలో సమస్యలకు కారణం అవుతుంది.

అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం పండితులు ఎలాంటి నియమాలు చెబితే అవి పాటించాలి అంటారు  వాస్తు శాస్త్ర నిపుణులు.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వారంలో ప్రతి రోజుకు ఒక ప్రాధాన్యత, ప్రాముఖ్యత అనేది ఉంటుంది. అయితే వారంలో కొన్ని రోజులు కొన్ని పనులు అస్సలే చేయకూడదంట.

అవి ఏవో.. ఏ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదో..చేస్తే ఎలాంటి కష్టాలు, నష్టాలు ఎదురు అవుతాయో, ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం వారంలో రెండు రోజులు అస్సలే బట్టలు ఉతకకూడదంట. ఒక వేళ ఉతికినట్లు అయితే ఇంట్లో ప్రతి కూల శక్తి పెరిగి ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి అంటున్నారు పండితులు.

మంగళ వారం, శని వారం రోజుల్లో అస్సలే బట్టలు ఉతకకూడదంట. ఈ రోజుల్లో బట్టలను ఉతకం చాలా అశుభంగా భావిస్తారు. ఇది మంచిది కాదు అంటున్నారు పండితులు.

వాస్తు శాస్త్రం ప్రకారం మంగళవారం రోజు కుజుడికి సంబంధించిన రోజుగా, అదే విధంగా శనివారం శనీశ్వరుడికి సంబంధించిన రోజుగా చెప్తుంటారు పండితులు.

మంగళవారం రోజున లేదా శని వారం రోజున మాసిన బట్టలు ఉతకడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఈ క్రమంలో ఇంటి ఆర్థిక పరిస్థితి పై ప్రతికూల ప్రభావం కూడా పడి సంపద తగ్గిపోతుందంట.