ఏంటీ రాత్రి త్వరగా నిద్రపట్టడం లేదా? బెస్ట్ టిప్స్ మీ కోసమే

samatha 

26 MAY 2025

Credit: Instagram

శరీరానికి నిద్ర చాలా అవసరం. కానీ కొంత మందికి రాత్రి సమయంలో పడుకుందాం అంటే అస్సలే నిద్ర రాదు. దీంతో చాలా ఇబ్బంది పడతారు.

కొంత మంది ఎక్కువ సేపు స్రీన్ ముందు ఉండటం వలన, నిద్రలేమి సమస్య వలన ఇలా చాలా కారణాల వలన సరైన టైమ్‌కి నిద్ర రాదు.

అయితే రాత్రి సమయంలో త్వరగా నిద్రపోవాలి అంటే తప్పకుండా ఈ చిట్కాలు పాటించాలి అంటున్నారు ఆరోగ్య నిపుణుల. అవి ఏవి అంటే?

రాత్రి సమయంలో ఎక్కువ సేపు ఫోన్, ల్యాప్ టాప్ చూడకూడదంట. దీని వలన స్క్రీన్ లైటింగ్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది అంటున్నారు నిపుణులు.

అలాగే మీరు త్వరగా పడుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా బెడ్ రూమ్‌లో లైట్ ఆఫ్ చేసుకోవాలంట. వెలుతురు లేకుండా ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి.

అంతే కాకుండా కెఫిన్ ఉన్నవి తీసుకోకూడదు. ముఖ్యంగా టీ, కాఫీలు వంటివి మీరు పడుకోవడానికి గంట ముందు నుంచే తీసుకోకూడదంట.

అదే విధంగా నిద్ర పోవడానికి ముందు ఎక్కువ మొత్తంలో ఆహారం తినకూడదంట. ఇది మీ నిద్రను పాడు చేసే ఛాన్స్ ఉన్నదంట.

అయితే కొంత మంది మధ్యాహ్నం సమయంలో ఎక్కువ సేపు నిద్రపోతారు. దీంతో రాత్రి సమయంలో నిద్ర పట్టదు. అందుకే పగటి పూట తక్కువ సేపు నిద్రపోవాలంట.