ప్రతి రోజూ చికెన్ తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

samatha 

24 MAY 2025

Credit: Instagram

చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా చికెన్ తింటుంటారు. కొందరు రోజుకు ఒకసారి తింటే మరి కొందరూ ప్రతి రోజూ చికెన్ తింటారు.

అయితే చికెన్ ప్రతి రోజూ తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. కాగా, అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

చికెన్‌లో విటమిన్స్, ఖనిజాలు, ఆమైనో ఆమ్లాలు అధికంగా ఉన్నప్పటికీ చికెన్‌ను అతిగా తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు వైద్యులు.

చికెన్ ఎక్కువగా తినడం వలన శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుందంట. దీని వలన ఎముకలు కీళ్ల సమస్యలు వస్తాయంట.

అంతే కాకుండా ప్రతి రోజూ చికెన్ తినడం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందంట. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ ఉండటం వలన రక్తపోటును పెంచుతుంది.

కిడ్నీ సమస్యలతో బాధపడే వారు ప్రతి రోజూ చికెన్ తినకూడదంట. దీని వలన కిడ్నీ వ్యాధి రావడమే కాకుండా,కాలేయం చుట్టూ కొవ్వు పెరిగిపోతుందంట.

చికెన్‌లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. కాబట్టీ ప్రతి రోజూ చికెన్ తినడం వలన శరీరంలో ప్రోటీన్ పరిమాణాన్ని పెంచుతుందంట. దీని వలన మూత్ర నాళాల వ్యాధి ప్రమాదం కూడా ఉన్నదంట.

అలాగే ప్రతి రోజూ చికెన్ తినడం వలన అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదంట. అందువలన ప్రతి రోజూ చికెన్ తినకూడదంట.