రాత్రి సమయంలో కాఫీ తాగవచ్చా?నిపుణులు ఏం చెప్తున్నారంటే?
samatha
26 MAY 2025
Credit: Instagram
కాఫీని ఇష్టపడని వారు ఎవరుంటారు. ప్రతి రోజూ ఎంతో ఇష్టంగా కాఫీ తాగుతుంటారు. మరీ ముఖ్యంగా కొంత మందికి ఉదయం లేచిన వెంటనే కప్పు కాఫీ తాగనిదే అసలు ఆ రోజే గడవనట్లు ఉంటుంది అంటుంటారు.
ఇంకొంత మంది మధ్యాహ్నం తాగుతుంటారు. మరికొందరు రాత్రి సమయంలో కాఫీ తాగుతారు. అసలు కాఫీ ఏ టైమ్ లో తాగాలి. కాఫీ రాత్రి తాగవచ్చో తెలుసుకుందాం.
కాఫీ అంటే చాలా మందికి ఇష్టం. కొందరు రోజులో ఒకసారి కాఫీ తాగితే, మరికొందరు కనీసం రోజులో రెండు లేదా మూడు సార్లు ఎంతో ఇష్టంగా కాఫీ తాగుతుంటారు.
ముఖ్యంగా ఆఫీసుల్లో పని చేసే వారు రాత్రి సమయంలో కాఫీ తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. అయితే రాత్రి సమయంలో కాఫీ తాగకూడదు అంటున్నారు నిపుణులు.
రాత్రి సమయంలో కాఫీ తాగడం వలన అది శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందంట. అనేక సమస్యలు ఎదుర్కునే ఛాన్స్ ఉన్నదంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా కాఫీ మన నాడీ వ్యవస్థ పై ప్రభావం చూపిస్తుందంట. నిద్రలేమి సమస్యకు దారి తీస్తుంది. విపరీతమైన తలనొప్పి, అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయి.
రాత్రి సమయంలో కాఫీ తీసుకోవడం వలన ఆందోళన, గుండె ఊపిరితిత్తుల రేటు పెరగడం, జీర్ణ సంబంధ సమస్యలు ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయంట.
రాత్రి కాఫీ తాగినట్లయితే, నిద్ర త్వరగా రాదంట. దీంతో అలసట, దృష్టి లోపం, పనితీరు తగ్గిపోవడం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి