అసలే వర్షాకాలం స్టార్ట్.. రాత్రి సమయంలో పెరుగు తినడం మంచిదేనా?
samatha
27 MAY 2025
Credit: Instagram
వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది పెరుగు తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా రాత్రి సమయంలో తప్పకుండా పెరుగు అన్నం తింటారు.
అయితే ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. దీంతో చాలా మందిలో అనేక డౌట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదేనా అనే అనుమానం ఉంటది. దాని గురించి తెలుసుకుందాం.
ఎక్కువ మందికి అన్నంలో చివరకు ఒక ముద్దు పెరుగుతో తినందే అన్నం తిన్న ఫీలింగ్ ఉండదు. అయితే వర్షాకాలంలో పెరుగు తినకూడదు అంటారు.
దీంతో చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే దీనిపై నిపుణులు మాట్లాడుతూ.. వర్షాకాలంలో పెరుగు తినడం మంచిదే కానీ మితంగా తినాలని చెబుతున్నారు.
పెరుగులో అనేక పోషకాలు శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అందువలన ఇది తినడం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
అందువలన దీనిని ఏ సీజన్‌లో తిన్నా ఎలాంటి సమస్యలు ఉండవంట. అయితే వర్షాకాలంలో మాత్రం రోజుకు 200 గ్రాముల పరుగుతినాలంట.
దీని వలన మలబద్ధకం సమస్యలు తగ్గడమే కాకుండా జీర్ణక్రియ సాఫీగా సాగుతుందంట. అంతే కాకుండా ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది అంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా వర్షాకాలంలో రాత్రి సమయంలో పెరుగును చాలా తక్కువమోతాదులో తినాలంట. లేకపోతే జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ అంటున్నారు నిపుణులు.