వర్షాకాలంలో ట్రెక్కింగ్ చేయడానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే!
samatha
31 MAY 2025
Credit: Instagram
చాలా మంది సమ్మర్ వచ్చిందంటే చాలు వెకేషన్స్‌కు వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కొంత మంది మాత్రం వర్షాకాలంలో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తుంటారు.
తొలకరి చినుకులు పడుతుంటే, వాతావరం చాలా చల్లగా ఉండటంతో ఆనందంగా తమకు నచ్చిన ప్లేసెకు వెళ్లి స్నేహితులతో లేదా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు.
ఇక చాలా మందికి ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కాగా, వర్షాకాలంలో ట్రెక్కింగ్ చేయడానికి బెస్ట్ ప్లేసెస్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కర్ణాటలోనే ఎత్తైన శిఖరం ముల్లయనగిరి. ఇది చూడటానికి చాలా అద్భుతమైన ప్రదేశం. ఇక్కడి చుట్టూ పచ్చని కొండలు ,వాటర్ ఫాల్స్, చాలా మంచి అనుభూతినిస్తాయంట.
ట్రెక్కింగ్ కు ఏపీలోని గండికోట బెస్ట్ ప్లేస్. దీనిని ఇండియన్ గ్రాండ్ కాన్యాన్ అని కూడా పిలుస్తారు. నది ప్రవాహం, చుట్టూ చెట్లుతో ఈ ప్రదేశం చూడటానికి సినిమా సెట్ లా ఉంటుందంట.
తమిళనాడులోని నీలగిరి కొండలు చూడటానికే కాదు ట్రెక్కింగ్ కూడా చాలా బెస్ట్ ప్లేస్ అంట. ఇక్కడి పచ్చని కొండలు, టీ తోటలు, చూస్తూ సరదాగా గడపవచ్చునంట.
తెలంగాణలోని అంతగిరిహిల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ హీల్స్ ట్రెక్కింగ్ స్పాట్ నాలు కీలోమటర్ల దూరంలో ఉంటుందంట.
కొలుక్కుమలై ప్రపంచంలోనే ఎత్తైన టీ తోటల్లో ఒకటి. ఇది సముద్ర మట్టం నుంచి 2,170 మీటర్ల ఎత్తులో ఉన్న స్పాట్ వర్షాకాలంలో చాలా ఆహ్లాద కరంగా ఉంటుంది.