చిన్న పిల్లలకు మేకపాలు తాగించడం వలన కలిగే లాభాలు తెలుసా?

samatha 

01 JUN  2025

Credit: Instagram

నేడు ప్రపంచ పాల దినోత్సవం కాగా, ఈరోజు పాలకు సంబంధించిన  కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎలాంటి పాలు పెట్టడం మంచిదో తెలుసుకుందాం.

పిల్లల అభివృద్ధికి సరైన పోషకాహారం చాలా అవసరం. ఇక చిన్నపిల్లలకు పాలు అనేది తప్పనిసరిగా తాగించాలని చెబుతుంటారు. ముఖ్యంగా ఆరు నెలల లోపు పిల్లలకు తల్లి పాలే ఉత్తమం.

ఇక సంవత్సరం దాటిన పిల్లలకు చాలా మంది ఆవులపాలు, కొందరు బర్రె పాలు తాగిపిస్తుంటారు. ఇంకొందరు మేక పాలు తాగిస్తారు.కాగా, పిల్లల ఆరోగ్యానికి  ఏపాలు మంచివో ఇప్పుడు తెలుసుకుందాం

ఆవు పాలు అనేవి చాలా సులభంగా దొరుకుతాయి. అంతే కాకుండా ఆవు పాలను తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

ఆవు పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది ఎముకలు, దంతాల అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది.

అయితే ఆవు పాలతో ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి.ఆవు పాలు కొంత మంది పిల్లలకు కడుపు నొప్పి, గ్యాస్ విరేచనాలకు, అలెర్జీలకు కారణం అవుతుంది.

కానీ ఆవు పాల కంటే పిల్లలకు మేక పాలు చాలా ప్రయోజనకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మేక పాలు తాగడం వలన అవి త్వరగా జీర్ణం అవుతాయి. అంతే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు.

అలాగే మేక పాలల్లో A2 కేసైన్ ప్రోటీన్ ఉండటం వల్ల ఇది ఆవు పాల కంటే తక్కువ అలెర్జీని కలిగిస్తుంది.అలాగే శరీర, అభివృద్ధికి అవసరమైన కాల్షియం, పొటాషియం, భాస్వరం కలిగి ఉంటుంది.కాబట్టి పిల్లలకు మంచి ఎంపిక