పురుషుల్లో థైరాయిడ్ ఉంటే కనిపించే కామన్ లక్షణాలు ఇవే !

samatha 

04 JUN  2025

Credit: Instagram

ప్రస్తుతం చాలా మంది థైరాయిడ్ బారిన పడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు చాలా మంది థైరాయిడ్ సమస్యతో సతమతం అవుతున్నారు.

రోజు రోజుకు థైరాయిడ్ వ్యాధి గ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అయితే చాలా మంది థైరాయిడ్ అంటే మహిళలకు మాత్రమే ఈ సమస్య ఉంటుంది అనుకుంటారు.

కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది పురుషులు కూడా థైరాయిడ్ బారిన పడుతున్నారు. అయితే పురుషుల్లో థైరాయిడ్ ఉంటే ఏ లక్షణాలు కనిపిస్తాయో చూద్దాం.

పురుషుల్లో థైరాయిడ్ ఉంటే కామన్ గా ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తాయంట. ఇవి గనుక మీలో ఉంటే థైరాయిడ్ సమస్య ఉన్నట్లే అంటున్నారు వైద్యులు. అవి

పురుషుల్లో సడెన్ గా జుట్టు రాలడం, పొడి చర్మం, జుట్టు పలచబడినట్లు అనిపించడం వంటి సమస్యలు గనుక ఉన్నట్లైతే తప్పకుండా ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

థైరాయిడ్ హర్మోన్లు శరీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అయితే థైరాయిడ్ సమ్య ఉన్నట్లైతే పురుషుల్లో మానసిక ., ఆందోళన వంటివి సమస్యలు ఎక్కువవుతాయంట.

పురుషుల్లో థైరాయిడ్ సమస్య ఉంటే ఆ వ్యక్తి ఆకస్మికంగా బరువు తగ్గడం లేదా పెరగడం చేస్తారంట. ఈ లక్షణం గనుక మీలో ఉన్నట్లైతే థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందేనంట.

థైరాయిడ్ సమస్య ఉంటే పురుషుల్లో కామన్ గా కనిపించే లక్షణాల్లో ఎప్పుడూ అలసిపోయినట్లు కనిపించడం. ఎంత బాగా ఉన్నా ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపిస్తే థైరాయిడ్ ఉన్నట్లేనంట.