వంటల్లో పూదీన వేస్తే ఆ వంట రుచే మారిపోతుంది అంటుంటారు మన పెద్దవారు. ఎందుకంటే ఇది అంత మంచి రుచిని ఇస్తుంది.
ఇక నాన్ వెజ్ వంటకాలు ముఖ్యంగా బిర్యానీ, మటన్, చికెన్ వండితే తప్పకుండా పుదీనా ఉండాల్సిందే. అయితే వంటల్లో రుచి ఇవ్వడమే కాకుండా పుదీనతో బోలేడు ప్రయోజనాలు ఉన్నాయంట. అవి.
పుదీనాలో విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయంట. అందు వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా తక్షణ శక్తిని అందిస్తాయంట.
అలాగే పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మీ శరీరాన్ని కాపాడి, మంచి రక్షణను ఇస్తాయంట.
పుదీనాను వంటల్లో చేర్చుకొని తినడం వలన ఇది జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుందంట. అలాగే కడుపు ఉబ్బరం, అజీర్తి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది జలుబు, ముక్కుదిబ్బడ వంటి సమస్యతో సతమతం అవుతారు. అలాంటి వారు పుదీనా ఆకుల వాసన పీల్చడం ద్వారా వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
అలాగే వీటిలో ఉండే కెరోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు రాలడం సమస్య నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయంట. పేలు, చుండ్రు సమస్యను తగ్గిస్తాయి.
కంటి చూపు మెరుగు పరిచే విటమిన్ ఏ పుదీనాలో పుష్కలంగా ఉంటుంది. అందుకే దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన కంటి చూపు మెరుగుపడుతుందంట.