బెల్లం పాలు కలిపి తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే !

samatha 

05 JUN  2025

Credit: Instagram

బెల్లం పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది షుగర్‌కు బదులు బెల్లం కలిపిన పాలు తాగడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

ముఖ్యంగా వేడి వేడి పాలల్లో బెల్లం కలుపుకొని తాగితే ఆ రుచే వేరే లెవల్ ఉంటుంది. అందుకే చాలా మంది బెల్లం పాలు తాగుతుంటారు.

కాగా, బెల్లం కలిపిన పాలు తాగడం వలన పిల్లలకు, పెద్ద వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

పాలల్లో బెల్లం కలుపుకొని తాగడం వలన మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందంట. అంతే కాకుండా జీర్ణక్రియ సాఫీగా సాగుతుందంట.

అలాగే,బెల్లంలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువలన బెల్లం పాలు తాగడం వలన పిల్లల్లో ఎదుగుదల బాగుంటుందంట.

ఇక చాలా మంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు. అటువంటి సమయంలో బెల్లం కలిపిన పాలు ఇవ్వడం వలన వారు పాలు తాగడానికి ఆసక్తి చూపిస్తారంట.

బెల్లం కలిపిన పాలను పిల్లలు తాగడం వలన వారిలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, ఇది వారి ఎముకలను బలంగా తయారు చేస్తుందంటున్నారు నిపుణులు.

బెల్లం కలిపిన పాలు తాగడం వలన పిల్లలు ప్రశాంతంగా నిద్ర పోతారంట. అలాగే జలుబు, దగ్గు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందంట.