భారత దేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ఎంత వేగంతో ప్రయాణిస్తుందో తెలుసా?

samatha 

05 JUN  2025

Credit: Instagram

భారత దేశపు మొట్టమొదటి హై స్పీడ్ బుల్లెట్ రైలు ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఈ రైలు ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు 508 కిలోమీటర్ల దూరన్ని కవర్ చేస్తుంది.

కాగా, ఇప్పుడు మనం భారతదేశపు మొట్ట మొదటి బుల్లెట్ రైలు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది. దాని గురించిన కొన్ని విషయాలను వివరంగా  తెలుసుకుందాం.

భారత దేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు గరిష్ట వేగం గంటకు 320 కి.మీ దూరాన్ని కవర్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందంట.

అంతే కాకుండా బుల్లెట్ రైలు గరిష్ట వేగం గంటకు 320 కి.మీ కానీ అది గంటకు 280 కి.మీ వేగంతో నడుస్తుందని చెబుతున్నారు నిపుణులు.

అదే విధంగా,  దేశంలో తొలి బుల్లెట్ రైల్ 2026 చివరి వరకు ముంబై టూ అహ్మదాబాద్ కారిడార్ మధ్య నడుస్తుందని తెలుపుతున్నారు అధికారులు.

ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ప్రయాణీకులు ప్రయాణించడానికి  ఏడు గంటలు పడుతుంది. కానీ ఈ బుల్లెట్ రైలు సహాయంతో 2 గంటల ఏడు నిమిషాల్లో అహ్మదాబాద్ చేరుకోవచ్చు.

ఇక ఈ బుల్లెట్ రైలు ఏ స్టేషన్ల గుండా వెళ్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. కాగా, దీని గురించిన సమాచారం తెలుసుకుందాం.

ఈ రైలు ముంబై టూ అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు కారిడార్ లోని థానే, విరార్, బోయిసర్, వాపి, సూరత్, వడోదరతో సహా 12 స్టేషన్ల గుండా వెళ్తుందంట.