వర్షాకాలంలో రాగిజావా తాగవచ్చా? నిపుణులు ఏమంటున్నారంటే?
samatha
08 JUN 2025
Credit: Instagram
వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక వ్యాధులు స్వైరవిహారం చేస్తాయి. అందుకే ఈ సీజన్‌లో మంచి ఆహారం తీసుకోవాలని సూచిస్తుంటారు వైద్య నిపుణులు. అయితే రాగిజావ ఆరోగ్యానికి చాలా మంచిదంటారు.
కాగా, మరి వర్షాకాలంలో రాగిజావ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా? దీనిపై నిపుణుల అభిప్రాయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం
రాగి జావ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కొంత మంది దీనిని వర్షాకాలంలో తాగవచ్చో లేదో అని కలత చెందుతారు. కానీ దీనిని ఏ సీజన్‌లో అయినా తాగవచ్చునంట.
వర్షాకాలంలో రాగి జావను తాగడం వలన అనేక లాభాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
వానాకాలంలో రాగి జావను తాగడం వలన ఇది ఈ సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యల బారిన పడకుండా కాపాడుతుందంట.
అలాగే ఈ సీజన్‌లో చాలా మంది ఊరికి ఊరికే బలహీనంగా అయిపోతుంటారు. అందువలన వర్షాకాలంలో రాగి జావను తాగడం వలన రోగనిరోధక శక్తి పెరిగి, చాలా యాక్టివ్‌గా ఉంటారంట.
రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని తాగడం వలన ఎముకలు దృఢంగా తయారు కావడమే కాకుండా ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుందంట.
రాగుల్లో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించడమే కాకుండా రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. అలాగే రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గేందుకు దోహదం చేస్తాయంట.