నేరేడు చేసే మ్యాజిక్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..బోలెడు లాభాలు !

samatha 

07  JUN  2025

Credit: Instagram

నేరేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది.  అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరూ తప్పకుండా నేరేడు పండ్లు తినాలని చెప్తుంటారు.

ఎందుకంటే ఈ పండ్లు వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి. అలాగే నేరేడు పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. అనేక సమస్యల నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది.

అందుకే తప్పనిసరి ఈ సీజనల్ ఫ్రూట్ తినాలంటారు. అయితే నేరేడు పండ్లు తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఈ సీజనల్ ఫ్రూట్‌లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ సి, విటమిన్ బీ తో పాటు అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయంట.

అందువలన ఈ సీజనల్ ఫ్రూట్స్ తినడం వలన ఇవి మధుమేహాన్ని కంట్రోల్ చేయడంతో పాటు, బరువు తగ్గించడంలో  కూడా ఉపయోగపడుతాయంట.

అలాగే నేరేడు పండ్లలో ఎక్కువ మొత్తంలో ఐరన్, విటమిన్ సి, ఉండటం వలన ఇవి రక్తంలోని హిమోగ్లోబిన్‌ను పెంచుతాయంట. అందుకే రక్తహీనత సమస్యతో బాధపడే వారు తప్పక వీటిని తినాలంట.

అంతే కాకుండా నేరేడు పండ్లు తినడం వలన కంటి చూపు మెరుగుపడుతుందంట. ఇక ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇది చర్మరక్షణకు చాలా ప్రయోజనకరం.

అదే విధంగా నేరేడు పండ్ల తినడం వలన ఇవి కడుపులోని చెడు బ్యాక్టీరియాను తొలిగించడమే కాకుండా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందంట.