మృగశిర కార్తె రోజు ఎండు చేపలు కాకుండా పచ్చి చేపలే ఎందుకు తింటారు?
samatha
07 JUN 2025
Credit: Instagram
జూన్ 8 మృగశిర కార్తె. ఈరోజున ప్రతి ఒక్కరూ చేపలు తింటారు. అంతే కాకుండా ఆస్తమా సమస్య ఉన్నవారు చేప ప్రసాదం తీసుకుంటారు.
మృగశిరతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి పోతుంది. దీంతో శరీరంలో వేడిని పెంచుకునేందుకు, అలాగే రోగనిరోధక శక్తి పెరిగేందుకు నేడు చేపలు తినాలంటారు.
అయితే మృగశిర రోజు చాలా వరకు ప్రతి ఒక్కరూ పచ్చి చేపలే తింటారు. ఎండు చేపలు ఎక్కువగా తినరు. మరి ఈరోజు పచ్చి చేపలే ఎందుకు తింటారో ఇప్పుడు తెలుసుకుందాం.
చేపల్లో పచ్చి చేపలు, ఎండు చేపలు రెండు రకాలు ఉంటాయి. ఇందులో కొందరికి పచ్చి చేపలు నచ్చితే, మరికొంత మందికి ఎండు చేపలు ఎక్కువ ఇష్టం ఉంటుంది.
దాదాపు రెండు చేపల్లో ఒకే రకమైన పోషకాలు ఉంటాయంట. కానీ పచ్చి చేపలతో పోలిస్తే ఎండు చేపల్లో ప్రోటీన్ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కేజీ పచ్చి చేపలకు 200ల ప్రొటీన్ లభిస్తే ఎండు చేపలకు 600 ప్రోటీన్ లభిస్తుందంట.
అయితే వర్షాలు మొదలయ్యే సమయంలో ఎండు చేపలు తినడం కంటే పచ్చి చేపలు తినడం వల్లనే అనేక ప్రయోజనాలు కలుగుతాయంట.
అలాగే పచ్చి చేపలలో N-3 ఆయిల్ ఉందని, ఇది ఆస్తమా ప్రమాదాన్ని తగ్గిస్తుందని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే మృగశిర కార్తె రోజు పచ్చి చేపలే తింటారంట.
అంతే కాకుండా ఎండు చేపలు విరివిగా దొరుకుతాయి. కానీ మృగశిర కార్తె సమయంలో పచ్చి చేపలు చాలా ఎక్కవగా దొరకడం వలన వీటిని ఈ సమయంలో ఎక్కువ తింటారంట.