చిన్న బఠానీలతో బోలెడు లాభాలు.. తింటే ఎంత మంచిదో తెలుసా?

samatha 

08  JUN  2025

Credit: Instagram

పచ్చి బఠానీలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి. అందుకే చాలా మంది పచ్చి బఠానీలు తినాలని చెప్తుంటారు.

అయితే పచ్చి బఠానీలు ఎందుకు తినాలో, వీటిని ప్రతి రోజూ తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బఠానీలను పోషకాల గని అంటారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని తింటే ఎన్నో లాభాలు ఉంటాయంట.

ముఖ్యంగా  పచ్చటి బఠానీలను  తినడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తినిస్తుందంట.

అలాగే పచ్చి బఠానీల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన వీటిని తినడం వలన ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వద్ధి చెందేలా చేస్తుందంటున్నారు నిపుణులు.

అదే విధంగా బరువు తగ్గాలి అనుకున్న వారికి ఇది బెస్ట్ ఎంపికనంట. ఇందులోని సంతృప్తికరమైన మాక్రోన్యూట్రియెంట్ బరువు తగ్గడానికి సహాయపడుతుందంట.

బఠానీల్లో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందువలన వీటిని తినడం వలన గుండె సబంధ వ్యాధులను అరికట్టవచ్చునంట. గుండె ఆరోగ్యానికి బఠానీలు చాలా మంచిది.

బఠానీల్లో తక్కువ మోతాదులో గ్లైసెమిక్ ఉంటుంది. అందువలన వీటిని తినడం వలన ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకుంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తీసుకోవడం చాలా మంచిదంట