కరివేపాకే కదా అని చీప్‌గా తీసిపరేయకండి.. దీంతో బోలెడు లాభాలు!

samatha 

08  JUN  2025

Credit: Instagram

కరివేపాకు లేని ఇల్లే ఉండదు. ఏ కూరలోనైనా, ముఖ్యంగా సాంబార్, పప్పు చారులో కరివేపాకు వేసుకుంటే ఆ రుచే వేరుటుంది. రుచికే కాకుండా కరివేపాకుతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంట.

కరివేపాకులో ఆరోగ్యానికి మంచి చేసే అనేక పోషకవిలువలు ఉన్నాయంట. ముఖ్యంగా విటమిన్ ఏ, విమిన్ బి, సి, వంటివి పుష్కలంగా ఉంటాయంట.

అందువలన కరివేపాకును తినడం వలన ఇది దృష్టిని మెరుగుపరచడమే కాకుండా, ఒత్తిడిని తగ్గించి, రోగనిరోధక శక్తిపెరిగేలా చేస్తుందంట.

ఇందులో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, వంటి అనేక ఖనిజాలకు ఇది మూలం. అందువలన దీనిని తినడం వలన ఇది రక్తప్రసరణను మెరుగుపరిచి, ఎముకలను బలంగా తయారు చేస్తుంది.

కరివేపాకు జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. అందువలన దీనిని ఆహారంలో చేర్చుకోవడం వలన ఇది అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందంట.

కరివేపాకులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం దీనిలో ఎక్కువగా ఉండటం వలన ఇది గుండె జబ్బులను తగ్గిస్తుంది.

కరివేపాకు కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో హెపాటో ప్రొటెక్టివ్ లక్షణాలు ఉండటం వలన ఇది కాలేయాన్ని రక్షించి దీని పనితీరును మెరుగుపరుస్తుంది.

కరివేపాకులో ప్రోటీన్స్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండటం వలన ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని మీ డైట్‌లో చేర్చుకోవడం వలన జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.