ఈ సౌందర్యమైన బ్లూ టీ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో! 

Jyothi Gadda

13 May 2025

ఈ పుష్పాన్ని పూజలో ఎంత పవిత్రంగా భావిస్తారో ఆయుర్వేదంలోనూ అంతే ప్రత్యేకంగా చూస్తారు. ఆయుర్వేద వైద్యంలో ఎన్నో అనారోగ్యాల చికిత్సకు శంఖుపుష్పాన్ని వాడుతూ ఉంటారు. 

ఈ బ్లూ టీని ఎండిన శంఖుపుష్పాలతో తయారు చేస్తారు. శంఖుపుష్పాల టీని తరచుగా తీసుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

తరచూ బ్లూ టీ తీసుకోవటం వల్ల యాంటీ-డయాబెటిక్, యాంటీ-కేన్సర్ లక్షణాలుకూడా ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నవారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌. గుండెకు ఎంతో మేలు చేస్తుంది.

బ్లూ టీ తాగడం వల్ల వాంతులు, వికారం తగ్గుతుంది. బ్లూ టీలో ఉంటే యాంటీ గ్లైసటీన్ ప్రాపర్టీస్ వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముడతలు రాకుండా యవ్వనంగా కనిపిస్తారు.

బ్లూ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. లక్షణాలతో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

ఊబకాయంతో బాధపడుతున్న వారు ఈ టీతాగడం బరువు తగ్గినట్టు అధ్యయనాల్లో రుజువైంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. 

షుగర్‌ పేషెంట్స్‌ రెగ్యులర్‌ టీ కాకుండా బ్లూ తాగితే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. బ్లూ టీలోని ఆంథోసైనిన్ కారణంగా జుట్టు రాలడం తగ్గుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అలసట, చికాకుగా ఉన్నప్పుడు ఈ బ్లూ టీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. బ్లూ టీలో కెఫిన్‌ ఉండదు. కాబట్టి రోజుకు రెండుసార్లు అయినా హ్యాపీగా ఈ టీని తీసుకోవచ్చు.