అతి త్వరగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలా.. బెస్ట్ టిప్స్ మీ కోసమే!
samatha
09 JUN 2025
Credit: Instagram
గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని ఎవరికి ఉండదు చెప్పండి. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతగానో కష్టపడుతారు. కానీ కొంత మందికే గవర్నమెంట్ జాబ్ వస్తుంది.
అయితే గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే, కష్టపడటం, అదృష్టమే కాకుండా వాస్తు కూడా బాగుండాలి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడంలో వాస్తు శాస్త్రం విజయాన్ని ఇస్తుందంట.
అయితే కెరీర్‌లో వృద్ధిలోకి వచ్చి, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే? వాస్తు ప్రకారం ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
మీలో ఏకాగ్రత పెరగాలి అంటే ఉత్తరం లేదా తూర్పు దిశలో చదువుకోవాలంట. ఈ దిశలు సానుకూల శక్తిని తేవడమే కాకుండా ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే చదివినది ఎక్కువగా గుర్తు ఉంటుందంట.
మీరు పడుకునే పడకను నైరుతి దిశలో ఉంచుకోవాలంట. దీని వలన మీకు ప్రశాంతమైన నిద్రపడుతుంది. అంతే కాకుండా మంచం కింద ఎప్పుడూ చెత్త చెదారం లేకుండా చూసుకోవాలంట.
ఉత్తర దశ అనేది కెరీర్ వృద్ధితో ముడిపడి ఉంటుంది. అందువలన ఈ దశలో ఓ ఆకుపచ్చటి మొక్క లేదా మనీ ప్లాంట్ పెట్టుకోవడం వలన అది అనేక అవకాశాలను తీసుకరావడానికి సహాయపడుతుందంట.
మీ ప్రవేశ ద్వారం అనేది మీ కెరీర్ విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ ఇంటి మెయిన్ ద్వారం కలర్ ఫుల్‌గా ఉంటే మీ జీవితంలో కెరీర్ పరంగా బాగుంటుందంట. అవకాశాలు వస్తాయంట.
వాస్తు చిట్కాలు పాటించడం వలన అనుకూలమైన వాతావరణం సృష్టించడమే కాకుండా, ఇది మీ కెరీర్‌కు, ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు అనే అవకాశాలను పెంచడానికి దోహదం చేస్తాయంట.