ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహార పదార్థాలు ఇవే!

samatha 

09  JUN  2025

Credit: Instagram

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారపదార్థాలు ఏవో తెలుసా. వాటి ధర చూస్తే షాక్ తినడం ఖాయమంట. కాగా, అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంకుమ పువ్వు నుంచి కేవియర్ వరకు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన, అరుదైన ఆహారపదార్థాలు ఉన్నాయంట. అవి మంచి రుచిని కూడా ఇస్తాయంట. అవి ఏవి అంటే?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారపదార్థాల్లో కుంకుమ పువ్వు ఒకటి. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుందంట. అంతే కాకుండా దీనిని ఎర్ర బంగారం అని కూడా పిలుస్తారు. ఇది కిలో గ్రాముకు రూ.5000.

ఇటలీలో పండే , మట్టి సువాసనకు ప్రసిద్ధి చెందిన తెల్ల ట్రఫుల్స్ కిలో గ్రాముు రూ.3000 కంటే చాలా ఎక్కువనంట. ఇది వంటకాల్లో వేస్తే చాలా మంచి రుచిని ఇస్తుందంట. చాలా ఖరీదైన ఆహారపదార్థం

నల్లబంగారం అని పిలుచుకునే బెలూగా కేవియర్ అత్యంత ఖరీదైన వంటకం. ప్రపంచంలోనే ఖరీదైన వంటకాల్లో ఇదొక్కటి అంట. ఇది కిలో గ్రాముకు రూ.5000లపైనే ఉంటుందంట.

చేపలు అంటే చాలా మందికి ఇష్టం. అయితే మంచి రుచిని ఇచ్చే వాటిల్లో బ్లూఫిన్ ట్యూనా చేపలకు చాలా ధర ఉంటుందంట. ఈ చేపలు వేలంలో లక్షలాది రూపాయలకు అమ్ముడుపోతాయంట. అత్యంత ఖరీదైన చేపలు ఇవి.

అత్యంత ఖరీదైన ఆహారపదార్థాల్లో జపనీస్ పుట్టగొడుగులు ఒకటి . వాటి కొరత కారణంగా ఇవి కిలోగ్రాముకు రూ.1000 ఉందంట. వీటితో కర్రీ చేస్తే టేస్ట్ అదిరిపోద్దంట.

ప్రపంచంలోనే అత్యంత అరుదైన కాఫీలలో ఒకటిగా పిలవబడే కోపి లువాక్, సివెట్ ఒకటి. ఇది కిలో గ్రాముఖు 700 వరకు ఉంటుందంట.