కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న వారికి వరం ఈ మొక్క.. కనిపిస్తే వదలకండి
samatha
09 JUN 2025
Credit: Instagram
రణపాల మొక్క గురించి చాలా మందికి తెలియదు. ఇది ఏదో గడ్డి మొక్క అని పక్కన పారేస్తుంటారు. కానీ దీని వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
అయితే రణపాల మొక్క వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అవి ఏవి అంటే?
ఆయుర్వేద శాస్త్రంలో అనేక రకాల మొక్కల గురించి ప్రస్థావించడం జరిగింది. అందులో రణపాల మొక్క కూడా ఒకటి. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.
దీనిని ప్రతి రోజూ ఖాళీ కడుపుతో తినడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కిడ్నీ సమస్యల ఉన్నవారికి ఇది వరం అంట.
ప్రతి రోజు వీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల నుంచి ఉపశమనం లభిస్తుందంట. అంతేకాకుండా తలనొప్పి, యోని ఇన్ఫెక్షన్, వంటి సమస్యలను దూరం చేస్తుందంట.
అలాగే చాలా మంది మహిళల్లో యోని ఇన్ఫెక్షన్స్ సమస్యలు వస్తున్నాయి. దీంతో వారు అనేక రకాలుగా ఇబ్బది పడుతున్నారు. అలాంటి వారు ఈ మొక్క ఆకుల రసాన్ని కషాయంగా చేసుకొని తాగడం చాలా మంచిదంట.
కొంత మంది కాలిన గాయాలు, లేదా మచ్చలతో ఇబ్బంది పడుతారు. అయితే అలాంటి వారు ఈ మొక్కల ఆకులను రుబ్బి పేస్టులా చేసుకొని గాయాల వద్ద పెట్టుకోవడం వలన మరకలు పోతాయంట
అలాగే ఈ రణపాల మొక్క రక్తపోటు, షుగర్ వంటి సమస్యలను దూరం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.