జామకాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. అంతే కాకుండా ఇవి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇక జామకాయల్లో రెడ్ కలర్, వైట్ కలర్ రెండు రకాల జామలు ఉంటాయి.
అయితే కొంత మంది జామకాయలు తినడానికి ఎక్కువ ఇష్టపడరు. కానీ వీటిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవి ఏవో చూద్దాం.
జామ పండ్లల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని తింటే రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా ఇన్ఫెక్షన్ల నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతుంది.
ఒత్తిడిని తగ్గించడంలో కూడా జామకాయ కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే ఇందులో ఉండే మెగ్నీషియం, మీ శరీరంలో కండరాలు, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.
జామలో యాంటీ ఆక్సిడెంట్స్ , విటమిన్ సి, విటమిన్ ఎ, పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇవి మీ చర్మాన్ని సంరక్షించి వృద్ధప్యా ఛాయలు రాకుండా అడ్డుకుంటుంది.
జామకాయలో క్యారెట్స్ లో ఉండేంత విటమిన్ ఎ లేకపోయినప్పటికీ, ఇది కంటి చూపు మెరుగు పరచడంలో మాత్రం కీలకపాత్ర పోషిస్తుంది. కంటి సమస్యలను దూరం చేస్తుంది.
విటమిన్ సి, లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ జామలో పుష్కలంగా ఉండటం వలన ఇవి క్యాన్సర్‌ను అడ్డుకుంటాయి. మంచికణాల దెబ్బతినకుండా కాపాడుతాయి.
జామకాయలో అధిక ఫైబర్ తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. దీని కారణంగా జామపండు తింటే ఇది రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలను నియంత్రిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరంగా పనిచేస్తుంది.