చిరిగిన నోటు పర్సులో పెట్టుకోవడం ఎంత ప్రమాదకరమో తెలుసా?

samatha 

10  JUN  2025

Credit: Instagram

ప్రస్తుతం పర్స్ లేని వారు ఎవరూ ఉండటం లేదు. చాలా మంది తమకు సంబంధించిన కార్డ్స్, డబ్బులను దాచుకోవడానికి పర్స్ వాడుతుంటారు.

ఇక కొందరు పర్స్ లక్ష్మీదేవిగా పూజించి చాలా భద్రంగా దాచుకుంటారు. కానీ కొంత మంది మాత్రం పర్స్ విషయంలో ఎలాంటి నియమాలు పాటించరు, జాగ్రత్త తీసుకోరు.

ఎందుకంటే తమ పర్స్‌లో చిరిగిన నోట్లను కూడా దాచిపెట్టుకుంటారు. కానీ ఇది వాస్తు శాస్త్రం ప్రకారం అస్సలే మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే?

వాస్తు శాస్త్రం ప్రకారం మీ పర్సులో చిరిగిన నోట్లు పెట్టుకోవడం వలన అది మీ పురోగతిపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుందంట.

చిరిగిన నోట్లను పర్స్‌లో పెట్టుకోవడం వలన అలాంటి వారిపై లక్ష్మీ దేవి కోపంగా ఉంటుందంట. అంతే కాకుండా ఆ వ్యక్తి డబ్బుపరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటాడంట.

అదే విధంగా చిరిగిన నోట్లు మీ పర్స్ లో పెట్టుకోవడం వలన చాలా వరకు ఆర్థిక నష్టం జరిగే ఛాన్స్ ఉన్నదంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

అలాగే చిరిగిన నోట్లను మీ పర్స్‌లో పెట్టుకోవడం వలన వ్యాపారం,వృత్తిలో నష్టాలు సంభవించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట.

అంతే కాకుండా చిరిగిన నోట్లను మీ పర్స్‌లో పెట్టుకోవడం వలన మీ వద్ద ఎప్పటికీ తగినంత డబ్బు ఉండదంట. ఇది ఆదాయాన్ని తగ్గిస్తుందంట.