జూన్‌లో తప్పకుండా చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఇవే!

samatha 

10  JUN  2025

Credit: Instagram

జూన్ నెలలో వాతావరణం చల్లగా మారిపోతుంది. దీంతో చాలా మంది టూర్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ నెలలో తప్పకుండా ఈ ప్రదేశాలు చూడాలంట. అవి ఏవి అంటే?

కర్ణాటకలోని కుంటా బీచ్ పచ్చని కొండలు, అందమైన సూర్యస్తమయాల మధ్య చాలా అందంగా కనిపిస్తుంది. జూన్ నెలలో చూడటానికి ఇది బెస్ట్ ప్లేస్.

పశ్చిమ బెంగాల్ లోని కాలింపాంగ్. మఠా అడవులు, పూల నర్సరీలు, పొగమంచుతో కూడిన కొండలు, చల్లటి వాతావరణం, తేలికపాటి జల్లులతో జూన్‌లో ఈ ప్రదేశం అతి సుందరంగా ఉంటుందంట.

జూన్ నెలలో చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాల్లో ఉత్తరాఖండ్ లోని హిమాలయ శిఖరాలతో చల్లటి వాతావరణంలో మంచుకొండలతో అందంగా ఉండే కౌసాని బ్యూటిఫుల్ ప్లేస్. ఇది చాలా బాగుంటుందంట.

ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి అలాగే ప్రకృతి ప్రేమికులు తప్పకుండా జూన్ నెలలో మున్సియారి, ఉత్తరాఖండ్ వెళ్లాలంట. అక్కడి పచ్చటి ప్రకృతి , మంచుకొండలు చాలా బాగుంటాయంట.

మహారాష్ట్రలోని విదర్బలో ఉన్న ఏకైక హిల్ స్టేషన్ చిఖల్దార ఇది జూన్‌లో సందర్శించడానికి అనువైన ప్రాంతం. కాఫీ తోటలు అందనీ ఆకట్టుకుంటాయి.

జూన్ నెలలో వెంబనాడ్ బుతుపవనాలతో మ్యాజిక్ చేస్తుంది. అందుకే తప్పని సరిగ జూన్ నెలలో కేరళ ప్రకృతి అందాలను చూడాలి అంటారు టూరిస్ట్‌లు

ప్రకృతి మధ్య అందంగా నడవాలి అన్నా, నది ఒడ్డున క్యాంపింగ్, ట్రౌట్ ఫిషింగ్ కు బెస్ట్ ప్లేస్ హిమాచల్ ప్రదేశ్‌లోని బారోట్. జూన్ నెలలో టూరిస్ట్‌కు బెస్ట్ ప్లేస్.