అప్పులు ఇవ్వడం వలన కలిగే లాభాలు ఇవ్వే.. తెలిస్తే షాక్ అవుతారు!
samatha
Pic credit - Instagram
అప్పులు ఇవ్వడం, తీసుకోవడం చాలా కామన్. ఈరోజుల్లో చాలా మంది అప్పులు ఇవ్వడానికి భయపడి పోతుంటారు. ఎందుకంటే, డబ్బులు తిరిగి వస్తాయో, రావో అని భయం.
కానీ అప్పులు ఇవ్వడం వలన కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
నిజం చెప్పాలంటే, అప్పుల ఇవ్వడం ఓ కళ అంట, దాని వలన మనం అనేక సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చును.
అంతే కాకుండా, నిజమైన బంధాలు, నిజమైన మిత్రులు ఎవరో తెలిసిపోతుంది. దీని వలన మనం మన జీవితంలో మరింత జాగ్రత్తగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.
స్నేహంగా ఉన్న సమయంలో చాలా మంది ఒకరికి ఒకరు ఖర్చు చేస్తుంటారు. కానీ మనం మన మిత్రుడికి అప్పు ఇవ్వడం వలన తన కోసం ఖర్చు చేయాలి అనిపించదు, దీంతో ఖర్చు తగ్గుతుంది.
అలాగే, ఎప్పుడూ ఫోన్ చేస్తూ మాట్లాడే వారు అప్పు ఇవ్వగానే మొహమాటం వలన ఎక్కువగా ఫోన్ చేయరు, దీని వలన వారు మళ్లీ అప్పు అడిగే ఛాన్స్ ఉండదు, మిగితావారు అప్పు అడిగినా ఈ సాకు చెప్పి తప్పించుకోవచ్చు.
అలాగే ఒకసారి అప్పు ఇస్తే కొందరు సమయానికి తిరిగి ఇస్తారు కానీ అస్సలే ఇవ్వరు, అయితే ఇలా మోసపోవడం వలన జీవితంలో అప్పు ఇవ్వకుండా ఉంటాం. ఇది కూడా మీ మంచికేనంట.
అంతే కాకుండా, కొందరు బంధువులు అప్పు అడిగితే లేవు అని చెప్పడానికి ఇబ్బంది పడుతారు. కానీ మోసం చేయడం వలన ఎవరు అడిగినా సులభంగా నో చెప్పవచ్చు, దీని వలన బంధం కట్ చేయకుండా ఉంటాయి.