అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇక కొంత మంది ఎక్కువగా అరటి పండ్లను తినడానికి ఇష్టపడితే మరి కొందరు పచ్చి అరటికాయలను తమ డైట్‌లో చేర్చుకుంటారు.
అయితే అరటి పండ్లు మాత్రమే కాకుండా, అరటి కాయలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయంట.కాగా, ఇప్పుడు మనం పచ్చి అరటిపండ్లు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏవో చూద్దాం.
పచ్చి అరటి పండ్లు తినడం వలన ఇందులోఉండే ఫైబర్ పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి6, ఐరన్ , కాల్షియం, వంటి పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి.
ముఖ్యంగా పచ్చి అరటి పండ్లను మీ డైట్‌లో చేర్చుకోవడం వలన ఇవి గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయంట. గుండెను కాపాడుతాయి.
రక్తహీనతతో బాధపడే వారికి కూడా ఇవి బెస్ట్ ఆప్షన్. మీ డైట్‌లో వీటిని చేర్చుకోవడం వలన ఇవి రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి.
ప్రతి రోజూ ఒక పచ్చి అరటి కాయ తినడం వలన ఇందులో ఉండే ఫైబర్, కడుపు సమస్యలను తగ్గించి, జీర్ణక్రియ సాఫీగా అయ్యేలా చేస్తుందంట. మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది.
ఎముకల బలానికి కూడా పచ్చి అరటి పండ్లు చాలా మంచిది. వీటిలో కాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఇవి ఎముకల బలానికి ఎంతగానో ఉపయోగపడుతాయంట.
అయితే పచ్చి అరటి పండు తినడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటిని అధికంగా తీసుకోవడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.