జ్ఞాపక శక్తి పెరగాలంటే తప్పకుండా చేయాల్సిన 10 వ్యాయామాలు ఇవే!
samatha
10 JUN 2025
Credit: Instagram
మీ మెదడు షార్పుగా ఉండటమే కాకుండా జ్ఞాపకశక్తి పెరగాలంటే తప్పకుండా కొన్ని వ్యాయామాలు చేయాలంట. అవి ఏవి అంటే?
ధ్యానం అనేది ఒత్తిడి ఉపశమనం కోసం మాత్రమే కాకుండా అది ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుందంట. అందుకే ప్రతి రోజూ 10 నిమిషాలు ధ్యానం చేయాలంట.
కొత్త భాష నేర్చుకోవడం వలన మీ మైండ్ పనితీరు మెరుగు పడుతుంది. వాటిని గుర్తుంచుకోవడం వంటి సమస్యలను ఎదుర్కోవడం ద్వారా జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది.
అలాగే, జ్ఞాపక శక్తి పెరిగే ఆటలు ఆడాలంట. క్రాస్ వర్డ్‌లు, సుడోకు, జిగ్సా పజిల్, మ్యాచింగ్ గేమ్స్ ఆడటం అనేది మెదడు పనితీరుకు, జ్ఞాపక శక్తి పెరగడానికి దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు.
వివరాల రీకాల్ ట్రిక్ ద్వారా కూడా జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చునంట. వ్యక్తి చొక్కా రంగు, వారి బూట్లు, కేశాలంకరణ, వారు ధరించినవాటిని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించడండి. ఇది మైండ్‌ను షార్ప్ చేస్తుంది.
సంగీతం నేర్చుకోవడం వలన కూడా మైండ్ షార్ప్‌గా పని చేస్తుంది. ఎందుకంటే దీని వలన కంఠస్థం చేయడం, చేతిచ కంటి సన్వయం, చురుకుగా వినడం వంటివి ఉంటాయి, ఇవి మీ జ్ఞాపక శక్తిని పెంచుతాయి.
కొత్త మార్గంలో వెళ్లడంచ కొత్త పనులు చేయడం వంటివి మీ మానసిక ప్రశాంతతను పెంచడమే కాకుండా, మెదడు షార్పుగా పని చేసేలా చేస్తుందంట.
అలాగే మీరు ఏదైనా కొత్త విషయాన్ని గనుక నేర్చుకున్నట్లు అయితే దానిని ఇతరులకు వివరిస్తూ నేర్పండి దీని వలన అది మీకు ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.