ఆవాలే కదా అని తీసి పారెయ్యకండి..అద్భుత ప్రయోజనాలు తెలిస్తే.. 

Jyothi Gadda

25 June 2025

ఆవాలు అధిక పోషకాలను కలిగి ఉంటాయి. శరీరానికి కావలసిన క్యాల్షియం, ఫైబర్, రాగి, విటమిన్ లను అందిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంచుతాయి.

ఆవాలు మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఆవాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జీర్ణక్రియ పెరుగుతుంది.

అవాలతో గుండెపోటుకు, చెడు కొలెస్ట్రాల్ కు చెక్ ఆవాలు మన హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆవాలు గింజలను తీసుకోవడం వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 

మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనివలన మన శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది ధమనులలో కొవ్వు పేరుకు పోవడాన్ని నిరోధిస్తుంది. ఆవాలు హృదయ వ్యాధులను తగ్గిస్తాయి. 

గుండెపోటు బారి నుంచి మనల్ని కాపాడతాయి. ఆహారంలో ఆవాలను భాగంగా చేసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు బలపడతాయి. ఎముకలకు, చర్మానికి మేలు చేస్తుంది. 

ఆవాలు చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. మన చర్మాన్ని తేమగా ఉంచేలా చేస్తాయి. ఆవాల గింజలను తీసుకోవడం వల్ల మొటిమలు తగ్గుతాయి. చర్మ రంద్రాలలో మురికిని తొలగిస్తాయి.

ఆవాలలో ఉన్న విటమిన్లు, ఖనిజాలు చర్మానికి పోషణను అందిస్తాయి. అలాగే చర్మం వాపును, ఎరుపును తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. చర్మం సాఫ్ట్‌గా ముడతలు లేకుండా ఉంటుంది. 

ఆవాలతో అద్భుతమే జరుగుతుంది ఆవాలతో తెల్ల జుట్టు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జుట్టు రాలే సమస్యల నుంచి కూడా ఆవాలు ఉపశమనం కలిగిస్తాయి.