ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా..?

Jyothi Gadda

22 June 2025

బొప్పాయితో ప్రోటీన్​ డైజెషన్​ పెరుగుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి. దీనిలోని ఫైబర్, వాటర్​ కంటెంట్​తో జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. 

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి పండు తినటం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. కడుపు ఉబ్బరం, అజీర్తి బాధలు ఉండవు. ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నారు నిపుణులు. 

బొప్పాయి పండు తినడం వల్ల శరీరంలోని విషవ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో జీర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. జీర్ణ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

బొప్పాయిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. బొప్పాయి పండును తినడం వల్ల ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది. చర్మ సమస్యలు దూరమవుతాయి.

బొప్పాయి పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో బరువు తగ్గొచ్చు.

బొప్పాయిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో మలబద్ధకం సమస్య మీ దరికి చేరకుండా ఉంటుంది. జీర్ణ ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.

బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఇమ్యూనిటీని పెంచుతాయి. తద్వారా అనేక రకాల ఇన్పెక్షన్ల నుంచి కాపాడుతుంది. 

బొప్పాయిలో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. బొప్పాయి పండుని తింటే ఆర్థరైటిస్ సమస్య ఉండదు. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.