సాధారణంగానే బంగారం అన్న, గోల్డ్ నగలన్నా ఇష్టపడతారు. బంగారంతో ఒంటి నిండా నగలు దిగేసుకోవాలని ఆశ పడుతుంటారు. అయితే కేవలం అందం కోసమే కాదు..
అందం కోసం కాదు.. అదృష్టం కోసం కూడా బంగారం ధరించాలని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. సింహ, తుల, కన్య, మకర, మీన రాశులవారు బంగారం ధరిస్తే మంచిదట.
బంగారం ధరించడం వల్ల వ్యక్తి సంపద, ఆనందం , శ్రేయస్సు పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. అలాగే వ్యక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
శరీరంలోని కొన్ని భాగాలకు బంగారాన్ని ధరించడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఆదివారం, బుధవారం లేదా శుక్రవారం రోజుల్లో బంగారం ధరించడం మంచిది.
ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ముక్కుకు పెట్టుకునే ఆభరణాలు ధరించాలి. ముక్కు పుడకలు, ముక్కులకు రింగ్‌లు, ప్రత్యేకమైన చిన్న ఆభరణాలు ధరించడం ఎంతో మంచిది.
చెవికి బంగారు ఆభరణాలు ధరిస్తే వారి కేతు గ్రహం బలంగా మారుతుంది. ఆ గ్రహం బాగుంటే స్థితిగతులు బాగుంటాయి. చెవి రింగులు,చెవి దిద్దులు,లోలాకులు,చెంప పిన్నులు పెట్టుకోవచ్చు.
భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు ఉంటే, పరస్పర ప్రేమను పెంచడానికి, భార్యాభర్తల జీవితంలో ఆనందం కోసం, మెడలో బంగారం ధరించాలి. చైన్ లు, హారం అయినా ఫర్వాలేదు.
చూపుడు వేలుకు బంగారు ఉంగరం ధరిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మానసిక బలం చేకూరుతుంది. డబ్బు సమస్యలు ఉన్నవారు వెంటనే చూపుడు వేలుకు రింగ్ ధరించండి.