డయాబెటిస్ బాధితులకు దివ్యౌషధం.. రైస్‌కు బదులుగా తీసుకుంటే లాభాలు..!
Jyothi Gadda
25 June 2025
జొన్న సంగటి అనేది దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ప్రధాన ఆహారంగా ఉపయోగించే ఒక సంప్రదాయ వంటకం. పూర్వం కాలంలో దీనిని ఎక్కువగా తినేవారు.
జొన్నలలో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉండి, శరీరానికి శక్తినిస్తాయి.
జొన్నలతో చేసిన సంగటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.
ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు నియంత్రణకు చాలా సహాయపడుతుంది. ఫైబర్ కడుపు నిండినట్లు అనిపించేలా చేస్తుంది, దీని వలన ఆహారం ఎక్కువగా తినాలనే కోరిక తగ్గుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది జొన్న సంగటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఇది డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది. జొన్నలు రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి, దీని వలన చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగదు.
జొన్న సంగటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులను తగ్గిస్తాయి.
జొన్న సంగటిలో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి. ఎముకల సాంద్రతను పెంచడానికి సహాయపడుతుంది. బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది.
జొన్న సంగటిలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.